వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం సోదరుడు…

0
3

వినాయక లడ్డూ దక్కించుకున్న ముస్లిం సోదరుడు

 

ఎంతో సంతోషంగా ఉందన్న ఎస్కె షరీఫ్

భారత్ అవాజ్ న్యూస్:-దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన పాత్రికే యుడు, ముస్లిం సోదరుడు వినాయకుని లడ్డూను వేలం లో సొంతం చేసుకొని హిందూముస్లిం భాయ్ భాయ్ అనే సందేశానికి నిదర్శనంగా నిలిచారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నానని అన్నారు. లడ్డును వేలంలో రూ.9,116కు కైవసం చేసు కున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా, అందరం కలిసి ఉండాలని, ప్రేమాభిమానాలతో సుఖ సంతోషా లతో ఉండాలని షరీఫ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వినాయక కమిటీ సభ్యులు భాషబోయిన సురేష్, వేణు, నరేష్, రాజేందర్, రాజు, రవి, ఎలకంటి కుమారస్వామి, మధుసూదన్, మహేష్, దండు రాజు, పాల్గొన్నారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..