ఐతవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనలో
మూడు రోజులుగా మృత్యువుతో పోరాటం
కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి
కంచికచర్ల, సెప్టెంబర్ 26 Bharat Aawaz :
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ రావ్ భాష (38) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడు బడే మియా కుమారుడు.
ఈ నెల 25న ఐతవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రావ్ భాష తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మూడు రోజులుగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం గండేపల్లికి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.










