కేసీఆర్‌ను తిట్టడం వల్ల లాభం ఎవరికి?

0
3

పది సంవత్సరాలు బీఆర్‌ఎస్ పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. కేసీఆర్ పాలనలో మంచి నిర్ణయాలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు మరియు కొందరు నాయకుల వ్యవహారశైలిపై వచ్చిన విమర్శలు, అవినీతి ఆరోపణలు బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతకు కారణమయ్యాయని అప్పట్లో రాజకీయ చర్చ సాగింది.

2023లో ప్రజలు తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే…

ప్రతిరోజూ కేసీఆర్‌ను విమర్శించడం వల్ల నష్టం ఎవరికీ? లాభం ఎవరికి?

గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉంటే విచారణ జరపాలి. తప్పు నిరూపిస్తే చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే వాటిపైనా పారదర్శకంగా సమాధానం చెప్పాలి. గతాన్ని తిట్టడం కంటే… వర్తమానాన్ని మార్చడం ముఖ్యం. ప్రజలకు కావాల్సింది ఎవరు ఎవరిని తిట్టారన్నది కాదు. ఉద్యోగాలు, రైతు భరోసా, పేదలకు ఇళ్లు, అభివృద్ధి, పారదర్శక పాలన.

కేసీఆర్ ఉన్నా… రేవంత్ ఉన్నా…

అధికారం ఎవరిదైనా — తెలంగాణ ప్రజలదే!

వీకెండ్ కామెంట్ ,శ్రీను రావు పొన్నాల,Bharat Aawaz