అనకాపల్లి రూరల్ రైల్వే స్టేషన్ పరిధిలో “స్వచ్ఛత కోసం క్రీడలు – ఈ హే సేవా 2026” కార్యక్రమం

0
3

అనకాపల్లి జిల్లా,అనకాపల్లి అర్బన్ రైల్వే స్టేషన్ ఏరియా,“స్వచ్ఛత కోసం క్రీడలు మరియు కార్యక్రమం అనంతరం పరిశుభ్రత”లో భాగంగా అనకాపల్లి రూరల్ రైల్వే స్టేషన్ పరిధిలో సపాయి కర్మచారులు, క్లీనింగ్ మరియు హౌస్‌కీపింగ్ సిబ్బందికి వివిధ ఆటపాటల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ముఖ్యంగా క్లీనింగ్ మరియు హౌస్‌కీపింగ్ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా శుభ్రత కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాలను అనకాపల్లి స్టేషన్ సూపరింటెండెంట్ శ్రీ రామకృష్ణ గారు మరియు తుని చీఫ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రోత్సహిస్తూ వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు పరిశుభ్రతపై అవగాహన మరియు బాధ్యతను మరింతగా పెంచడం జరిగింది.