కాకినాడ: అర్బన్ టూ టౌన్ పరిధిలోని బంగార్రాజు వీధిలో వైఎస్సార్ విగ్రహం సమీపంలో గత నాలుగు రోజులుగా చెత్త కుప్పలు పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాలు, వరదల కారణంగా పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, నీటి నిల్వలను నివారించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.










