అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వైడీ పేట పంచాయతీ వెన్నెల పాలెం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం జరిగింది. బీజేపీ అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా మార్కెట్ యార్డ్ సెల్ కన్వీనర్ గొంప సత్యనారాయణ అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో సేవ చేసిన పలువురిని సన్మానించారు. గ్రామంలో మొదటి ఉపాధ్యాయుడు, మొదటి వైద్యుడు, రైతు, పారిశుద్ధ్య కార్మికుడు, డప్పు కళాకారుడు, ఆశా వర్కర్, భజన బృందం గురువు, పత్రికా విలేకరి, ముగ్గురు పిల్లలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన మహిళ, గ్రామంలో మొదటి టైలర్ ను సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు నందిపెల్లి రమణ, బీజేపీ సీనియర్ నాయకులు బంగారు ఎర్రినాయుడు, గ్రామ పెద్దలు, యంగ్ టైగర్స్ యూత్ సభ్యులు, శ్రీ సీతారామ భజన బృందం సభ్యులు లాలం రమణబాబు, పోలిపర్తి నాయుడు, చిటికెల నానిబాబు, బల్ల నర్సింగరావు, సింగంపల్లి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.









