కదిరిలో క్రికెట్ సమరం. మైదానంలో పరుగుల వరద

0
2

 

 భారత్ ఆవాజ్ న్యూస్ కదిరి : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. అండర్-14 నుంచి సీనియర్స్ వరకు పలువురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.మెయిన్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏసీఏ సబ్‌సెంటర్ జట్టు 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. షాదన్ 82, తరుణ్ 55, ప్రణయ్ 47, నవదీప్ 40 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకే వారియర్స్ జట్టు 112 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటికీ, నూరుద్దీన్ 88, గౌస్ ఖాన్ 37 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు.మినీ గ్రౌండ్‌లో జరిగిన అండర్-14 మ్యాచ్‌లో ‘ఏ’ జట్టు 264 పరుగులు చేయగా, అఖిల్, ఆఫ్రాజ్, వేద అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం ‘బి’ జట్టు 160 పరుగులకే పరిమితమైంది. తెజేశ్వని 4 వికెట్లు, మనోజ్ 2 వికెట్లు, బాలాజీ, అజమల్, శివాజీ చెరో వికెట్ తీసుకున్నారు.పోటీలను కదిరి మండల క్రికెట్ సంఘం కార్యదర్శి ఎల్లప్ప, కోశాధికారి ముబారక్, సీనియర్ క్రీడాకారులు మున్నా, ఆది, ప్రసాద్, చంద్ర, మహేంద్ర తదితరులు ప్రారంభించారు.