ఏకగ్రీవాల గురించి మాట్లాడే అర్హత వైసిపికి లేదు. గండికోట సుధాకర్

0
2

రాయచోట లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాయచోటి రూరల్ మండల అధ్యక్షులు గండికోట సుధాకర్ మాట్లాడుతూ రాయచోటి వైసిపి నాయకుడు ఏకగ్రీవాల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు చదివినంత అందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాయచోటిలో వైసీపీ నాయకుడు గత రెండు రోజుల ముందు మీడియా సమావేశంలో రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని తెలపడం ఎంతవరకు సమంజసం అని, ప్రపంచం మొత్తం ఎల్ ని నో ప్రభావంతో వర్షాలు పడక కరువుతో ఇబ్బంది పడుతుంటే ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని తెలిపారు. భారతదేశంలో టైమ్స్ అనే దిగ్గజ పత్రిక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సమయంలో కూడా ముందుచూపు ఉన్న నాయకుడు అని పొగుడుతుంటే మీరు విమర్శించడం మీ దిగజారుడు రాజకీయమన్నారు. రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి కరువు పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో అన్ని విధాలుగా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి ఒక సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు పోవడం జరుగుతోందన్నారు. వైసిపి నాయకులు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప, ఒక ప్రశ్న సరైనది కాదని మీడియా ప్రతినిధులే గుసగుసలాడుకుంటున్నారని తెలిపారు. మాట మాట్లాడితే పోలీసులు ఏకపక్షంగా మాట్లాడుతున్నారని చెప్పడం, పోలీసు వ్యవస్థను నిందించడం సరికాదని తెలిపారు. మా ప్రభుత్వంలో ఎక్కడైనా వైసీపీ నాయకులు మీద అక్రమంగా కేసులు పెట్టినట్టు కానీ, వేధించినట్టుగానే నిజం నిరూపించాలని సవాల్ విసిరారు, అంతేగాని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అని ఎదుర్కోలేక ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. ఇక ఏకగ్రీవాల గురించి మాట్లాడితే ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఏకగ్రీవాగాలు అయిన వాళ్ళను మీ చుట్టూ పెట్టుకొని మాట్లాడుతున్నారని, మీరు ఎందుకు మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, మీరు వారం రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో ఇదే మాట్లాడుతూ నా పక్కనే ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడని అతన్ని కలుపుకొని ఎలక్షన్లకు ముందుకు పోతామని చెప్పలేదా అని ప్రశ్నించారు. ఆ నాయకుడే గత ఎలక్షన్లలో మీరు నామినేషన్లు చించేసారని, అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించిన నాయకుడు కాదా అని ప్రశ్నించారు. మీరు మీ పార్టీ నాయకులు చేత నామినేషన్లు వేయించుకోవడానికి ధైర్యం తెప్పించడానికి ప్రగల్బాలు పలికితే, ఇక్కడ ఉన్నది రాయచోటి టైగర్ రాంప్రసాద్ రెడ్డి అని గుర్తు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో యూనిట్ ఇన్చార్జి నాగార్జున రెడ్డి, రాయచోటి ఏఎంసి డైరెక్టర్ ఉదయగిరి మస్తాన్ వల్లి పాల్గొన్నారు.