మహనీయులకు జ్ఞాన మాలలు.|

0
6

● పూలే, అంబేద్కర్, గద్దర్ విగ్రహాలకు నివాళులు

● హాజరైన దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు

● మహనీయులపై పాటలతో ఆకట్టుకున్న వోసగుల సుధాకర్

అల్వాల్, సెప్టెంబర్ 28: పాత అల్వాల్ అంబేద్కర్‌నగర్ కాలనీలో మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాలకు ఆదివారం జ్ఞాన మాలలు సమర్పించారు.

గద్దర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ దళిత నాయకుడు, హైకోర్టు న్యాయవాది డాక్టర్ గడిపే నాగయ్య, మేడ్చల్ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంబేద్కరిస్ట్, సామాజిక కార్యకర్త యాదగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం డాక్టర్ గడిపే నాగయ్య, యాదగిరి మహనీయుల ఆశయాలు, సామాజిక సమానత్వం కోసం వారు చేసిన కృషిని వివరించారు. 

ఈ సందర్భంగా సి.ఎల్. యాదగిరి, ఎల్లమయ్యలు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు.

కార్యక్రమంలో ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి మహేందర్, రిటైర్డ్ టెలిఫోన్ అధికారి ఎస్. శివశంకర్, జి.రాజయ్య, రైల్వే బాలరాజ్, డప్పు ఆనంద్, తుడుం కృష్ణ, మూర్తి, కే. శ్రీనివాస్, కే.పీ. చందర్, దోశల రవి, చిత్తయ్య, సాయికుమార్ గౌడ్, కే. దేవేందర్, నరసింహ ముదిరాజ్, కురుమ ఐలయ్య, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

వోసగుల సుధాకర్ మహనీయులపై పాటలు ఆలపించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

#Sidhumaroju

Alwal