కదిరిలో జనసేన సన్నాహక సమావేశం

0
1

భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆశావహులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ భైరవ ప్రసాద్, కోఆర్డినేషన్ టీమ్ కమిటీ సభ్యులు శ్రీ పత్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.కదిరి మున్సిపాలిటీలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు, ప్రజలతో పార్టీ అనుసంధానం తదితర అంశాలపై ఆశావహులతో చిలకం మధుసూదన్ రెడ్డి చర్చించారు. అనంతరం కదిరి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఆశావహులతో 1-to-1 సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలు, సూచనలు, స్థానిక పరిస్థితులపై వివరంగా తెలుసుకున్నారు.

అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులైన 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. వారికి చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, లక్ష్మణ్ కుటాల, ఇర్ఫాన్, అంజిబాబు, కిన్నెర మహేష్, రాజేంద్ర ప్రసాద్, ఈటీ లోకేష్, చక్రధర్ బాబు, హరిబాబు, కొట్టే అశ్వర్థ, మండల నాయకులు భుక్య రవీంద్ర నాయక్, మేకల చెరువు చౌదరి, సాకే రవికుమార్, కేవీ రమణ, అన్నం జయవర్ధన్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, రెడ్డెమ్మ, జయశ్రీతో పాటు జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.