కుమ్మరవాండ్లపల్లిలో ఉలవల పంపిణీ

0
3

 భారత్ అవాజ్ న్యూస్ కదిరి : కుమ్మరవాండ్ల పల్లి , కదిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని స్వర్ణాలయంలో రైతులకు ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MPDO మేడం, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, వ్యవసాయ సహాయక కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి నాయకులు పేర్కొన్నారు.