భారత్ అవాజ్ న్యూస్ కదిరి : నల్లచెరువు ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కమిటీ చైర్మన్గా టీ. నవ్య, వైస్ చైర్మన్గా ఆనందరావు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమిటీ సభ్యుల సమన్వయంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నూతన కమిటీకి పలువురు అభినందనలు తెలిపారు.








