రోడ్డు పక్కన చెత్తాచెదారం. పట్టించుకోని పారిశుద్ధ్య సిబ్బంది

0
4

భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం  ఓ ప్రధాన రహదారి పక్కన చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చెట్ల మధ్య ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు, ఇతర చెత్తాచెదారం పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు రహదారి పక్కన శుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీలో పారిశుద్ధ్య సేవల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త తొలగింపు కూడా కీలకమైన పనిగా ప్రభుత్వం పేర్కొంది.