బీజేపీలో యువత, మహిళల చేరిక.|

0
6

● ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరిక

● మంద విజయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

● కొత్తగా చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానం

అల్వాల్, సెప్టెంబర్ 30: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం తుర్కపల్లి (190వ) డివిజన్‌కు చెందిన పలువురు యువత, మహిళలు బీజేపీలో చేరారు. 

డివిజన్ అధ్యక్షులు మంద విజయ్ ఆధ్వర్యంలో శామీర్‌పేట్‌లోని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కొత్తగా పార్టీలో చేరిన వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

దేశ భద్రత, అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే పటిష్టంగా కొనసాగుతుందనే నమ్మకంతో బీజేపీలో చేరినట్లు వారు తెలిపారు.

పార్టీలో చేరిన వారిలో శ్రీధర్ గౌడ్, మంద కిరణ్, శ్రావణి, సాయి భాస్కర్, నరేష్ యాదవ్, కుంచ శ్రీకాంత్ గౌడ్, శిరీష గౌడ్, ప్రసాద్ రెడ్డి, రాజా లక్ష్మి, దేవ్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ ఉన్నారు.

కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal