విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు

0
1

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు పాల్గొన్నారు._

ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు సహచర శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీ గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు._

 

_కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేదలు, నిరుపేద కుటుంబాలకు సొంతింటి స్థలం కల్పించడంతో పాటు, వారికి భూమిపై హక్కు కల్పించే దిశగా పట్టాల పంపిణీ కార్యక్రమాలను చేపడుతోందని ఎమ్మెల్యే గారు తెలిపారు.

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు._

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు._