న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన మహిళ…!

0
3

▪️ప్రణాళికతో మోసం చేశారని ఆవేదన

▪️26 ఏళ్లకే జీవితం పాడైందని కన్నీరుమున్నీరు

▪️గర్భవతినని తెలిపిన మహిళ

నందిగామ, సెప్టెంబర్ 30 bharat aawaz :

నందిగామ పట్టణానికి చెందిన బి. సోమేశ్వరి దేవి తనకు న్యాయం చేయాలని కోరుతూ నందిగామ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తన భర్తతో మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న అనంతరం షేక్ మహబూబ్ సుభానితో పరిచయం ఏర్పడిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

2024లో పెనుగంచిప్రోలులోని ఓ ఆలయంలో సుభానిని వివాహం చేసుకున్నామని, అనంతరం కలిసి జీవించామని సోమేశ్వరి తెలిపారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం తాను గర్భవతినని పేర్కొన్నారు.

రూ.6 లక్షల నగదు, బంగారం ఇచ్చానని ఆరోపణ

సుభానికి సుమారు రూ.6 లక్షలను నగదు రూపంలో ఇచ్చానని, తన బంగారం కూడా ఇచ్చినట్లు సోమేశ్వరి తెలిపారు. అనంతరం తనతో ఎలాంటి సంబంధం లేదని, తన మొదటి భార్యే కావాలని చెప్పి వెళ్లిపోయారని ఆమె ఆరోపించారు.

ఇటీవల సుభాని ఇంటికి వెళ్లి తన డబ్బు, బంగారం గురించి అడిగినప్పుడు తన స్కూటీని మాత్రమే తిరిగి ఇచ్చి పంపించారని తెలిపారు. బంగారం గురించి అడగగా లేదని చెప్పారని, మరోసారి అడిగితే ప్రాణాలు తీస్తామని బెదిరించినట్లు ఆమె ఆరోపించారు.

“26 ఏళ్లకే జీవితం పాడైందని ఆవేదన”

“26 సంవత్సరాల వయసులోనే నా జీవితం పాడైపోయింది. నమ్మిన వ్యక్తి వల్ల నేను ఈ పరిస్థితికి వచ్చాను” అంటూ సోమేశ్వరి కన్నీరుమున్నీరుగా వాపోయారు. తనకు న్యాయం చేసి, తన డబ్బు, బంగారం తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు.

ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.