మల్లాపూర్ దర్గాలో గ్యారవీ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు మైనారిటీ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరికీ శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్యారవీ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ సెల్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










