స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

0
1

భారత్ అవాజ్ న్యూస్ : నల్లచెరువు మండల కేంద్రంలోని స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనుల వివరాలు, పనుల ఎంపిక, అమలు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు.ఈ కార్యక్రమంలో ఏవో అశోక్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నరేష్ కుమార్, శ్రీనివాసులు, ఉపాధి హామీ సిబ్బంది టీఏ హిమాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ నరేంద్ర, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది విశ్వేశ్వర తదితరులు పాల్గొన్నారు.