Madanapalle : కరువు నేలలో సిరులు పండించాలనే లక్ష కోట్ల రూపాయల వ్యయంతోరాయలసీమ హబ్ ను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో పర్యటించి గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా…
రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు సుమారు రూ. లక్ష కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ విద్య: రిలయన్స్ సంస్థ సహకారంతో మదనపల్లెలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంబానీ సహకారంతో రైతులకు మరింత ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రిలయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.










