నందిగామ వైద్య రంగానికి మహర్దశ

0
2

నందిగామ అక్టోబర్ 2 భారత్ అవాజ్ : నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుక్రవారం పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న స్లాబ్ పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వంద పడకల ఆస్పత్రి పూర్తయితే నందిగామతో పాటు పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.

ప్రజలకు అత్యవసర, ఇన్‌పేషెంట్ తదితర ఆధునిక వైద్య సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.