ఆర్కే-5లో ఏఐటీయూసీలోకి 104 మంది ఉద్యోగుల చేరిక

0
3

ఆర్కే-5లో ఏఐటీయూసీలోకి 104 మంది ఉద్యోగుల చేరిక

 

శ్రీరాంపూర్, అక్టోబర్ 3:

శ్రీరాంపూర్ ఆర్కే-5 ఇన్‌క్లైన్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 104 మంది యువ ఉద్యోగులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌లో చేరారు. దీంతో ఆర్కే-5లో ఏఐటీయూసీ యూనియన్ మరింత బలోపేతమైందని నాయకులు పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమానికి పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగరావు అధ్యక్షత వహించగా, యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, అధ్యక్షుడు కొట్టే కిషన్ రావు, సహాయ కార్యదర్శి మోతుకూరి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంతో కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందన్నారు. కార్మికుల హక్కులు, సౌకర్యాల పరిరక్షణతో పాటు సింగరేణి సంస్థ భవిష్యత్తు కోసం కొత్త గనుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.

 

104 మంది ఉద్యోగులు యూనియన్‌లో చేరడం కార్మిక ఐక్యతకు నిదర్శనమని పేర్కొంటూ, కొత్తగా చేరిన యువ ఉద్యోగులకు నాయకులు అభినందనలు తెలిపారు.

 

కార్యక్రమంలో మైనింగ్ స్టాఫ్ ఏరియా ఉపాధ్యక్షులు అడ్డు శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అప్రోచ్ ఖాన్, మీడియా ఇన్‌చార్జి రాజకుమార్, ఆర్కే-5 గని ఉపాధ్యక్షుడు మెడగొని మల్లేష్, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్, శేఖర్, మైన్స్ కమిటీ సభ్యులు జీపీ రావు, లక్ష్మణ్, మురళి, భోగి మదనయ్య తదితరులు పాల్గొన్నారు.