ఎఫ్‌ఐసీ భవనం మరమ్మతులకు రూ.40 లక్షలు.. ఆర్వో ప్లాంట్ ఇన్సులేషన్‌కు రూ.2 లక్షలు..
నందిగామ అక్టోబర్ 3 bharat aawaz
నందిగామ మార్కెట్ యార్డులో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు మరో ముందడుగు పడింది. అందుబాటులో ఉన్న సేవింగ్స్ మార్కెట్ యార్డ్ నిధుల నుంచి ఎఫ్‌ఐసీ (FIC) భవనం మెయింటెనెన్స్ అండ్ రిపేర్ పనులకు రూ.40 లక్షలు, మార్కెట్ యార్డులో ఆర్వో ప్లాంట్ ఇన్సులేషన్ పనులకు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.42 లక్షల నిధులు మంజూరయ్యాయి.
ఈ మేరకు మంజూరు చేసిన సాంక్షన్ పత్రాన్ని నందిగామ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్, మార్కెట్ యార్డ్ సెక్రటరీలు కలిసి శనివారం నందిగామలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్‌లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచి రైతులకు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సౌమ్య గారు పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆమె సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










