తెలంగాణ

0
2

సింగరేణి సీఎస్‌ఆర్‌ సహకారంతో రెండు మొబైల్ లోక్ అదాలత్ వాహనాలు ప్రారంభం

 

హైదరాబాద్‌లో జరిగిన జాతీయ న్యాయ సేవల సంస్థ సౌత్‌ జోన్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి రెండు మొబైల్‌ లోక్‌ అదాలత్‌ వాహనాలను ప్రారంభించారు.

 

పేదలు, ఎస్సీ–ఎస్టీలు, మహిళలు, చిన్నారులు, కార్మికులు, ఇతర అణగారిన వర్గాలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడమే ఈ వాహనాల ప్రధాన లక్ష్యం.

 

₹68 లక్షల సీఎస్‌ఆర్‌ సహాయం

 

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ విజ్ఞప్తి మేరకు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ తన సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.68 లక్షలు కేటాయించి రెండు మొబైల్‌ లోక్‌ అదాలత్‌ వాహనాల కొనుగోలుకు సహకరించింది.

 

వాహనాల ద్వారా అందించే సేవలు:

 

ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన

 

లోక్‌ అదాలత్‌ల ద్వారా వివాదాల పరిష్కారం

 

గిరిజన హక్కులు, కార్మిక చట్టాలపై అవగాహన

 

మహిళలు, చిన్నారుల హక్కుల పరిరక్షణపై అవగాహన

 

రాజ్యాంగ ప్రాథమిక హక్కులపై న్యాయ క్లినిక్‌లు, అవగాహన కార్యక్రమాలు

 

ఆడియో–విజువల్‌, చిత్ర ప్రదర్శనల ద్వారా న్యాయ అవగాహన

 

 

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు న్యాయ సేవల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేసే కార్యక్రమానికి సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా సహకరించిన సింగరేణి సంస్థను తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధికారులు అభినందించారు.

 

సింగరేణి తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కోల్‌ మూవ్‌మెంట్‌) శ్రీ బి. వెంకన్న, ఏజీఎం (లా) శ్రీ అరవింద్‌, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ శ్రీ ఎన్. భాస్కర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.