భారత్ అవాజ్ న్యూస్: కదిరి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన, బృందంగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించేందుకు రోటరీ క్లబ్ బెంగళూరు వెస్ట్, రోటరీ క్లబ్ కదిరి సంయుక్తంగా నిర్వహించిన ‘ఇంటర్మీట్–2026’ ఆదివారం ముగిసింది.హరీష్ హైస్కూల్లో మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, అక్రమ రవాణా, క్యాన్సర్, రహదారి భద్రత తదితర సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చర్చలు, బృంద కార్యక్రమాల ద్వారా నాయకత్వ నైపుణ్యాలను అభ్యసించారు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, క్యాంప్ ఫైర్ నిర్వహించి, పాల్గొన్న వారికి ప్రమాణపత్రాలు అందజేశారు.హరీష్, వాల్మీకి, రెయిన్బో, గాండ్లపెంట జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రోటరీ డీజీ కేశవరెడ్డి, పూర్వ డీజీ చిన్నపరెడ్డి, రోటరీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.










