ఆసిఫాబాద్‌ 1వ వార్డులో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ చొరవ

0
44

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. వార్డులోని అవసరమైన ప్రాంతాల్లో నూతన విద్యుత్ స్తంభాల (కరెంట్ పోల్స్) ఏర్పాటు పనులను విజయవంతంగా చేపట్టారు. స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ ప్రత్యేక చొరవ, పర్యవేక్షణలో ఈ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. గత కొంతకాలంగా విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాంతంలో కొత్త స్తంభాల ఏర్పాటుతో విద్యుత్ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ప్రజల ఇబ్బందులను, సమస్యను సకాలంలో గుర్తించి, విద్యుత్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్‌కు వార్డు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ. వార్డు సమగ్ర అభివృద్ధికి, ప్రజల మౌలిక వసతుల కల్పనకు తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.