పోషకాహారంతోనే ఆరోగ్యం: అంగన్‌వాడీ ఉత్సవాల్లో సూపర్‌వైజర్.

0
1

అన్నమయ్య జిల్లాలోని మర్రికుంటపల్లి, మేడికుర్తి సచివాలయాల పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాలలో శనివారం అంగన్‌వాడీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అరుంధతి హాజరయ్యారు. ఆమె గర్భిణులు, బాలింతలు, తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ, రోజువారీ ఆహారంలో ఐరన్, ప్రోటీన్లు, మినరల్స్, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తల్లీ, పిల్లల ఆరోగ్యానికి, కుటుంబ ఆరోగ్యం మహిళల చేతుల్లోనే ఉందని, కాబట్టి మహిళలు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.