భారత్ అవాజ్ న్యూస్ : కదిరి వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న కదిరి పట్టణంలోని ఎన్జీ హోమ్‌లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కదిరప్ప తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.జిల్లాలో భూమిలేని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని, పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం చేసే అసైన్మెంట్ చట్ట సవరణను రద్దు చేయాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, దానిని నీరుగార్చే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాంజీ స్కీంను రద్దు చేసి గ్రామీణ కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 11న కదిరిలో జరిగే జిల్లా సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు, కూలీలు, గ్రామీణ పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కుల్లాయప్ప, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తాడిమర్రి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు చౌడప్ప, నాగేంద్ర, బత్తలపల్లి మండల నాయకులు వెంకటేశు, శివయ్య, ఓబులేసు, నాగరాజు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.










