ఆసిఫాబాద్ భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై మంత్రుల కీలక సమీక్ష

0
2

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):

నిర్మల్ కలెక్టరేట్ వేదికగా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత గారు పాల్గొని, జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని భూ సమస్యలు, రెవెన్యూ సేవల తీరు మరియు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ కె.హరిత మంత్రులకు సమగ్రంగా వివరించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. అలాగే, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు గట్టిగా సూచించారు.