ఆసిఫాబాద్‌ 11వ వార్డులో ముమ్మరంగా డ్రైనేజీ పనులు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్

0
25

ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్):

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ గారు కొబ్బరికాయ కొట్టి ఈ పనులను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ, కాలనీ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే డ్రైనేజీ పనులను చేపట్టినట్లు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, అత్యంత వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ రమాదేవి గారు, ఏఈ నవీన్ గారు, స్థానిక కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీలో ఎప్పటి నుంచో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభిస్తుండటంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, కౌన్సిలర్ రాపర్తి కార్తీక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.