శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ-3 ఇంక్లైన్, ఎస్ఆర్పీ-1 గనుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగుల్లో వందలాది మంది యువ కార్మికులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌లో చేరారు. ఎస్ఆర్పీ-3లో 309 మంది, ఎస్ఆర్పీ-1లో 156 మంది కార్మికులు యూనియన్‌లో చేరినట్లు నాయకులు తెలిపారు.ఎస్ఆర్పీ-3 ఇంక్లైన్ పిట్ కార్యదర్శి మురళీ చౌదరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా చేరిన కార్మికులకు స్వాగతం పలికారు. ఎస్ఆర్పీ-1లో పిట్ కార్యదర్శి దాడి రాజయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌కు కార్మిక హక్కుల సాధనలో సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. దీపావళి బోనస్, లాభాల వాటా, పెన్షన్, అదనపు ఇంక్రిమెంట్ వంటి అనేక శాశ్వత హక్కుల సాధనలో యూనియన్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కార్మిక హక్కులను కాపాడుకునేందుకు విద్యావంతులైన యువ కార్మికులు ఏఐటీయూసీ వైపు రావడం శుభపరిణామమన్నారు.










