బొబ్బిలిలో వర్షాల కోసం వరుణ యాగం

0
3

వర్షాలు కురవాలని ఎమ్మెల్యే బేబినాయన బొబ్బిలి శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని, భూగర్భజలాలు అడుగంటి తాగునీటి సమస్య తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. వర్షాలు కురిస్తే రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

#RAJESH