🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌లోని తేలివాడ అంగన్‌వాడీ భవనంలో మంగళవారం స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు గాయపడిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హరిత గారు వెంటనే స్పందించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన కలెక్టర్ హరిత, ప్రమాదానికి గురైన కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తక్షణమే అందించాలని సంబంధిత అధికారులను సూచించారు.










