అంగన్‌వాడీ కేంద్రంలో కూలిన స్లాబ్ పెచ్చులు ఐదుగురికి గాయాలు

0
3

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌లోని తేలివాడ అంగన్‌వాడీ భవనంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్న పిల్లలు మధ్యాహ్న భోజనం తింటున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఈ హఠాత్ పరిణామానికి గురైన ముగ్గురు చిన్న పిల్లలు, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో పిల్లలు అప్రమత్తమై వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, గాయపడిన ముగ్గురు పిల్లలను మరియు ఇద్దరు మహిళలను తక్షణమే చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ భవనాల నాణ్యత మరియు నిర్వహణ లోపంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.