చింతూరులోనే ఆటో ఫిట్‌నెస్ (బ్రేక్‌)లు చేయాలి – ఆటో యూనియన్.

0
3

చింతూరు ఏజెన్సీలోని ఆటోల ఫిట్‌నెస్ (బ్రేక్)పరీక్షలను చింతూరులోనే నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు కోరారు. నాలుగు మండలాల ఏజెన్సీ ప్రాంతానికి చింతూరు కేంద్రంగా ఉండగా, గత మూడు నెలలుగా స్కానర్ ద్వారా బ్రేక్ పరీక్షల కోసం రాజమండ్రి దగ్గర రాజనగరం వెళ్లాల్సి వస్తోందన్నారు. 100 వాహనాల్లో సుమారు 90 వాహనాలకు పరీక్షలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనివలన ప్రభుత్వానికి ఆదాయం కోల్పవడంతో పాటు వాహనదారులము ఘాట్‌రోడ్ల ప్రయాణంతో సమయం, ఖర్చు, ఆదాయం కోల్పోతున్నామని పేర్కొన్నారు. రవాణాశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఐటీడీఏ పీఓ స్పందించి చింతూరులోనే ఫిట్‌నెస్ యూనిట్‌ను కొనసాగించాలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

# Yadagiri