ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు, మాకు న్యాయం కావాలి. 

0
1

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా, చింతూరు ఐ టి డి ఏ ఎదురుగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో చింతూరు డివిజన్ పరిధిలో ఉన్న 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో ఉన్న సిబ్బంది అలాగే 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లలో పని చేస్తున్న సిబ్బంది దాదాపుగా 100 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. వీరి ప్రధాన డిమాండ్స్.

1)కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

2) అప్పటి వరకు వంద శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలి ఇంకా అనేక రకాల న్యాయమైన డిమాండ్లు తో నిరహార దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు, ఐదు సార్లు ప్రభుత్వం తో చర్చలు జరిపినప్పటికీ సానుకూలంగా స్పందన రాకపోవడం వలన తప్పని పరిస్థితిలో సమ్మె చేయాల్సిన అవసరం వచ్చిందని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కో ఛైర్మన్ టి జోగారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు,ఐ యన్ టి యు సి చింతూరు డివిజన్ అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు హాజరు కావడం జరిగింది, అలాగే నాలుగు మండలాల కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరు పెద్దఎత్తున కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.