బతుకమ్మ పండుగ సందర్భంగా 7వ డివిజన్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు : ఏల్పుల రవీందర్ కార్పొరేటర్

0
3

మంచిర్యాల: ముందస్తు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో, మేయర్ ధరణి మధుకర్ సహకారంతో, 7వ డివిజన్ కార్పొరేటర్ ఏల్పుల రవీందర్ ఆధ్వర్యంలో డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీరాంపూర్ కాలనీ, ఆర్‌కే-8 కాలనీ, కృష్ణమూర్తి నగర్‌తో పాటు డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు, పరిసరాలను శుభ్రం చేయించి చెత్తాచెదారం తొలగించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు.

పండుగల సందర్భంగా ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని ఆయన కోరారు.