రోడ్లపైకి పెరిగిన చెట్ల తొలగింపు : భీమిని రాజేష్ యూత్ కాంగ్రెస్ నస్పూర్ ప్రెసిడెంట్

0
4

మంచిర్యాల: 8వ డివిజన్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోడ్లపైకి పెరిగిన చెట్ల కొమ్మలతో వాహనదారులు, స్కూల్‌ ఆటోలు, సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వార్డు ఇంచార్జీల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వార్డు ఇంచార్జీ అత్కాపురం సతీష్‌, నరేగే నరేష్‌, బీమిని రాజేష్‌ వెంటనే స్పందించారు.

విషయాన్ని మేయర్‌ ధరణి మధుకర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో జేసీబీని ఏర్పాటు చేసి రోడ్లపైకి పెరిగిన చెట్లను తొలగించే పనులు చేపట్టారు. అలాగే స్టోర్‌ గోడ నుంచి అవసరమైన ప్రాంతాల్లో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయాలని జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు బీమిని రాజేష్‌ తెలిపారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.