విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో రూ. 2.37 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు

0
1

విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గార్ల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు ₹2.37 కోట్ల వ్యయంతో పూర్తయిన అభివృద్ధి భవనాలు, మౌలిక వసతుల పనులను మంగళవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రారంభించిన పనుల వివరాలు:

• 63వ వార్డు (క్రాంతి నగర్): జి.వి.ఎం.సి పశ్చిమ జోన్ పరిధిలోని క్రాంతి నగర్ డబుల్ ట్యాంక్ ప్రాంతంలో జి.వి.ఎం.సి సాధారణ నిధులు రూ. 95.00 లక్షలతో నూతనంగా నిర్మించిన సామాజిక భవనం ప్రారంభోత్సవం.

• 61వ వార్డు (మరిడి మాంబ కళ్యాణ మండపం వద్ద): జి.వి.ఎం.సి సాధారణ నిధులు రూ. 48.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సామాజిక భవనము (G+1) ప్రారంభోత్సవం.

• 61వ వార్డు (ఇందిరా నగర్ – 2): ఇందిరా నగర్ – 2 పరిధిలో జి.వి.ఎం.సి సాధారణ నిధులు రూ. 43.60 లక్షలతో నిర్మించిన సామాజిక భవనం ప్రారంభోత్సవం.

• 60వ వార్డు (బర్మా కాలనీ): జి.వి.ఎం.సి సాధారణ నిధులు రూ. 42.00 లక్షలతో నిర్మించిన సామాజిక భవనం (మొదటి అంతస్తు) ప్రారంభోత్సవం.

• 57వ వార్డు (సిద్ధార్థ నగర్): సమగ్ర శిక్ష – విద్యాశాఖ పరిధిలో ఎంపీ లాడ్స్ (MP LADS) నిధులు రూ. 8.00 లక్షల వ్యయంతో అంగన్‌వాడీ భవనం, మరుగుదొడ్లు మరియు స్టాఫ్ రూమ్ ఆధునీకరణ/నవీకరణ పనుల ప్రారంభోత్సవం.

 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం శరవేగంగా చేపడుతున్నామని నేతలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జి.వి.ఎం.సి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.