హామీల అమలు కోసం.. 21వ రోజూ దీక్ష.|

0
3

● ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్

● దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన బి. రాజేందర్ సింగ్

అల్వాల్, అక్టోబర్ 7: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి.

అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని బుధవారం ముఖ్య అతిథిగా హాజరైన బి. రాజేందర్ సింగ్ ప్రారంభించారు. 

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు.

21వ రోజు దీక్షలో మేడ్చల్ జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు సురేష్, విద్యార్థి నాయకులు నిఖిల్, బాలనరసింహ, రషీద్ దీక్ష చేపట్టారు.

కార్యక్రమంలో పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, దయాకర్, ముత్యాలు, నాగేశ్వర్, మల్లేష్ తదితరులు పాల్గొని ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం మరింత జాప్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

#Sidhumaroju

Alwal