*రాజన్న సిరిసిల్ల లో ఘనంగా “వికసిత్ భారత్ సంకల్ప సభ -సేవా జ్యోతి యాత్ర

0
3

రాజన్న సిరిసిల్ల జిల్లా లో సేవాసంకల్ప అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కొనసాగుతున్న 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంఘం అభ్యాన్లు భాగంగా బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్ప సభ శివజ్యోతి యాత్ర కార్యక్రమంలో లను ఘనంగా నిర్వహించారు

సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అమరవీరుల స్తూపం సమీపంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు ముఖ్య అతిథి మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి గారు జిల్లా ఇన్చార్జి శ్రీ గంగాడి మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వీక్షించారు

అనంతరం శివ జ్యోతి యాత్రను ప్రారంభించారు రథంపై జ్యోతిని వెలిగించగా చేనేత కార్మికుడు శ్రీ వెల్ది హరిప్రసాద్ గారు కావడం వెలిగించి ముఖ్య అతిథి శ్రీ పెద్దిరెడ్డి గారికి అందజేశారు అనంతరం పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీద గాంధీ చౌక్ వరకు బిజెపి జెండాలు చేతబట్టి నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు