బోయకొండ దసరా ఉత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టీడీపీ ఇంచార్జ్ మధు సూధన్ నాయుడు కొత్తూరు మురళి

0
0

పుంగనూరు – అక్టోబర్ 06 : చౌడేపల్లి మండలం దిగువపల్లి లో వెలసియున్న ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ దేవాలయంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాల విశిష్టతను ప్రజలకు విస్తృతంగా తెలియజేసేందుకు గోడ పత్రికలు దోహదపడతాయని ఆయన తెలిపారు. ఆక్టోబర్ 12వ తేదీన అరంభంమై 20వ తేదీ వరకూ దసరా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత వర్గాలు దృష్టి సారించాలని సూచించారు. అధిక సంఖ్యలో భక్తులు బోయకొండకు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు, కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఏకంబరం, ఆలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.