నూతనంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే: మిరియాల శిరీష దేవి.

0
3

సమీకృత స్త్రీ శిశు సంక్షేమా భివృద్ధి శాఖలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంప చోడవరం లో ICDS పధక సంచాలకులు ఉమా అధ్యక్షతన బుధవారం నూతనంగా అంగన్వాడీ కార్యకర్త, సహాయకులుగా ఎన్నికైన వారికి నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ICDS లో ఉద్యోగం పొందటం మంచిదన్నారు. మీరు గ్రామాల్లోనే ఉంటూ సేవలందించే అవకాశం ఉంటుందన్నారు. ఏ ఉద్యోగం అయినా క్రమ శిక్షణ కలిగి అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. కేవలం గుర్తింపు కాకుండా మన బాధ్యతలకు మనమిచ్చే గౌరవం ఏదైనా ఉందంటే అది కేవలం మన విధులను మనం మంచిగా చేయడమే అన్నారు. అలాగే రంప చోడవరం డివిజన్లో నూతనంగా ఎన్నికైన 1 అంగన్వాడీ కార్యకర్త, 91 అంగన్వాడీ సహాయకులకు మరియు చింతూరు డివిజన్లో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలకు, 76 మంది అంగన్వాడీ సహాయకులకు ఆమె చేతులు మీదుగా నియామక పత్రాలు అందించారు. నూతనంగా ఉద్యోగాల్లో చేరే వారు మంచిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాలని కోరారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ సభ్యులు షేక్ సుభానీ, మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, సీతపల్లి దేవస్థానం గడి బాపనమ్మ తల్లి ధార్మిక మండలి సభ్యులు సిద్దా వెంకన్న దొర, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు అడబాల బాపిరాజు, నియోజక వర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా బాపన్న దొర అనే బాబీ, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, మాజీ సర్పంచ్ వై.నిరంజనీదేవి, పతివాడ రమణ, ICDS PD ఉమ, CDPO క్రాంతి కుమారి, పర్యవేక్షకులు అధిక సంఖ్యలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri