మోదీ ఆశయాల సాధనకు కృషి
నందిగామ , అక్టోబర్ 8, bharat aawaz :
రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంతో పాటు వారి కుటుంబాలను ఆదుకోవచ్చని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన మాసోత్సవాల్లో భాగంగా చందర్లపాడు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
యువత రక్తదానం చేయడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా చందర్లపాడు మండల బీజేపీ అధ్యక్షుడు గుత్తా బాలకృష్ణ రక్తదానం చేశారు. మోదీ ఆశయాల సాధనకు తాను నిరంతరం కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు.
హాస్పిటల్ చైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో హాస్పిటల్ డైరెక్టర్ ఎర్రగొర్ల మౌనిక, సేవా సంకల్ప అభయాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉన్నం గిరిధర్, టౌన్ అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు దేవరకొండ రమాదేవి, ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ తొర్లకొండ సీతారామయ్య, కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ పోసాని గురునాథం, రైతు నాయకుడు రావూరి రమేష్, మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షురాలు బేగం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










