రాజ్‌ఘాట్‌ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వంశీకృష్ణ

0
2

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ ధర్నా స్థలానికి బయలుదేరారు. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొంటున్నారు.ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాజ్‌ఘాట్‌ ధర్నా స్థలానికి ఆయన ప్రయాణం సాగించారు.