టీడీపీ యాత్రపై ప్రధాని ప్రశంసలు.. కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్.

0
1

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘సేవా సంకల్ప యాత్ర’ను ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని అందించిన ప్రోత్సాహకర వ్యాఖ్యలు తమ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా లోకేశ్ తన పోస్టులో.. “ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారూ. గత 25 ఏళ్లుగా మీరు అందిస్తున్న నిరంతర సేవలు, సుపరిపాలనకు నివాళిగా ఈ యాత్రను ఒక చిన్న కానుకగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీ క్షేత్రానికి తీసుకెళ్లడం మాకు దక్కిన అరుదైన గౌరవం. ఇది మన ప్రజలు, సంప్రదాయాలు, దేశాన్ని ఏకం చేసే బంధాలను చాటిచెబుతోంది. ఈ యాత్రలో పాలుపంచుకున్న ప్రతి కార్యకర్తకు మీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి” అని వివరించారు.