మదనపల్లె: మదనపల్లె ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్ వద్ద ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లు వాహనాలు నడపకూడదని సూచించారు. వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని తెలిపారు. వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని, ఇతర ట్రాఫిక్ నిబంధనలను కూడా పాటించాలని అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సీఐ చాంద్ బాషా తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.










