Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు హంద్రీ-నీవా జలాలు చేరడం పట్ల మహిళా అధ్యక్షురాలు బైగారి భారతి నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

0
1

Madanapalle: మదనపల్లె ప్రజల తాగునీటి అవసరాలకు ఊరట కలిగించే విధంగా హంద్రీ–నీవా జలాలు ఇప్పటికే మదనపల్లె సమ్మర్ స్టోరేజ్‌కు చేరుకోవడం పట్ల మదనపల్లె నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బైగారి భారతి నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఆమె అభినందనలు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ వద్ద ఆమె మాట్లాడుతూ.. మదనపల్లె ప్రజల చిరకాల తాగునీటి సమస్యకు హంద్రీ–నీవా జలాల రాకతో ఎంతో ఊరట లభించిందని అన్నారు. మదనపల్లె, పుంగనూరు మీదుగా కుప్పం వైపు హంద్రీ–నీవా జలాలు ప్రవహిస్తూ ఇప్పటికే సమ్మర్ స్టోరేజ్‌లోకి చేరడం ఆనందకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రజలకు తాగునీరు అందించడం కంటే ముఖ్యమైన అంశం మరొకటి లేదని భారతి నాయుడు అన్నారు.