Madanapalle: మదనపల్లెలో భార్య దండామనిని కొడవలితో దాడి చేసి హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న భర్త మధుకర్‌రెడ్డిని తాలూకా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

0
1

మదనపల్లె: భార్య దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమె భర్త మధుకర్‌రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న దండామని (29)ను ఆమె భర్త మధుకర్‌రెడ్డి ఆగస్టు 29న కొడవలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. తంబళ్లపల్లె మండలం దిగువపల్లికి చెందిన మధుకర్‌రెడ్డిపై ఇప్పటికే ఆరు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు మదనపల్లె తాలూకా సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.