Madanapalle: మదనపల్లె జహా కాలనీ సమీపంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం చదును పనులు వేగంగా జరుగుతున్నాయి.

0
1

Madanapalle: మదనపల్లె జహా కాలనీ సమీపంలో టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్మించేందుకు అవసరమైన పనులను చేపట్టారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు 42వ వార్డు ఇంచార్జ్ మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా ప్రాంగణాన్ని చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. రెండు జేసీబీల సహాయంతో భూమిని చదును చేస్తూ నిర్మాణ పనులకు అనువుగా స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. కార్యాలయ నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయం అందుబాటులోకి వస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సమావేశాలు నిర్వహించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు మరింత సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.