ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి దసరా బోనస్ రూ.5 వేలు చెల్లించాలి ఐఐటీయూసీ డిమాండ్

0
2

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్):

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఈ నెల 15వ తేదీ లోపు దసరా బోనస్‌గా రూ.5,000 చెల్లించాలని ఐఐటీయూసీ (AITYUC) నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు జీజీహెచ్ (GGH) సూపరింటెండెంట్, ఏజెన్సీ ప్రతినిధి సంపత్‌కు వారు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

ఆసుపత్రిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందుకున్న ఏజెన్సీ ప్రతినిధులు స్పందిస్తూ.. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా హామీ ఇచ్చినట్లు ఐఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉపేందర్ స్పష్టం చేశారు. పండుగ వేళ సిబ్బందికి న్యాయం జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.